నెల రోజుల్లో “దేవర”, కౌంట్ డౌన్ స్టార్ట్

ఎన్టీఆర్(NTR) హీరోగా దర్శకుడు కొరటాల శివ(Koratala siva) రూపొందిస్తున్న దేవర పార్ట్ 1 మూవీ రిలీజ్ కు సరిగ్గా నెల రోజుల టైమ్ ఉంది. సెప్టెంబర్ 27న దేవర థియేటర్స్ లోకి రానుంది. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ తో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మేకర్స్. రెండు లుక్స్ లో ఎన్టీఆర్ ఫొటో రివీల్ చేస్తూ భయాలను పరిచయం చేస్తున్నాం అంటూ తెలిపారు. ఎన్టీఆర్ దేవరలో ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఈ పిక్ తో కన్ఫర్మ్ చేశారు మేకర్స్.

ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో కల్యాణ్ రామ్(Kalyan ram) నిర్మిస్తున్న దేవర సినిమా రెండు పార్టులుగా రానుంది. జాన్వీ కపూర్(jhanvi kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. దేవర వాయిదా వార్తల నేపథ్యంలో సెప్టెంబర్ 27నే సినిమా వస్తుందంటూ ఇలా కౌంట్ డౌన్ ద్వారా టీమ్ క్లారిటీ ఇస్తున్నట్లు ఉంది.