ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ దేవర 2 త్వరలో బిగిన్ కానుంది. దేవర 2ను అక్టోబర్ నుంచి ప్రారంభించాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
దేవర సినిమాతో ఎన్టీఆర్ ను కొత్తగా తెరపై ప్రెజెంట్ చేశారు దర్శకుడు కొరటాల శివ. దేవరతో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా దేవర 2ను నిర్మించనున్నాయి. దేవర కంటే దేవర 2ను మరింత బిగ్ స్పాన్ లో రూపొందించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారు.