ఆకట్టుకునే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ – ‘డిటెక్టివ్ కార్తీక్’ ట్రైలర్ రివ్యూ

వెండితెరపై అద్భుతాలు చేసివి ఎప్పుడూ చిన్న చిత్రాలే. మంచి టెక్నీషియన్స్ దర్శక నిర్మాతలు అయితే అవి తెరకెక్కించే బడ్జెట్ కు వచ్చే ఔట్ పుట్ కు ఎంతో సంబంధం ఉండదు. ఒక పెద్ద సినిమా తెచ్చే ఇంపాక్ట్ ను అలాంటి చిన్న చిత్రాలు తెరపై తీసుకొస్తాయి. మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి నిర్మాతగా చేసిన కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్ ట్రైలర్ ఇలాంటి ఇంప్రెషన్ కలిగిస్తోంది.

ఒక టెంత్ క్లాస్ అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ ను సంధ్య అనే అమ్మాయి టేకప్ చేస్తుంది. విద్యార్థిని హత్యకు గురైన విధానం ఎవరికీ అంతు చిక్కదు. ఆమె కేసు సాల్వ్ చేద్దామని వెళ్లిన సంధ్య మిస్సింగ్ కావడంతో ఆమెను ఇష్టపడే కార్తీక్ రంగంలోకి దిగుతాడు. ఈ రెండు కేసులను ఇన్వెస్టిగేషన్ చేపడతాడు. టెంత్ విద్యార్థిని హత్య కేసుతో పాటు సంధ్య మిస్సింగ్ కేసును కార్తీక్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ సినిమాలోని టెక్నికల్ అంశాలైన సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు డిటెక్టివ్ కార్తీక్ ఒక మంచి ఆప్షన్ లా కనిపిస్తోంది. ఈ నెల 21న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.