పెద్దగా వారసత్వం సపోర్ట్ లేకుండా హీరోగా ఎదిగి పేరు తెచ్చుకున్నారు అడివి శేష్. ఆయనను హీరోగా సక్సెస్ ఫుల్ గా నిలబెట్టిన సినిమా గూఢచారి. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గూఢచారి 2 కూడా రూపొందుతోంది. దీంతో పాటు శేష్ ఎక్స్ శృతి అనే వర్కింగ్ టైటిల్ తో మరో సినిమా చేస్తున్నాడు శేష్. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాను యార్లగడ్డ సుప్రియ, ఏషియన్ సునీల్ కలిసి నిర్మిస్తున్నారు. క్షణం, గూఢచారి సినిమాల సినిమాటోగ్రాఫర్ శానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాకు డెకాయిట్ అనే పేరును కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. త్వరలోనే డెకాయిట్ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.