“గేమ్ ఛేంజర్” డే 1 కలెక్షన్స్ ఎంతంటే?

రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా నిన్న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా టాక్ కు సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. డే 1 ఈ సినిమాకు 186 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ వెల్లడించింది.

మరోవైపు బుక్ మై షోలో గేమ్ ఛేంజర్ టికెట్ బుకింగ్స్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. బుక్ మై షో ద్వారా ఈ సినిమాకు మొదటి రోజు 1.3 మిలియన్ టికెట్స్ అమ్ముడయ్యాయి. గేమ్ ఛేంజర్ సినిమా చూసిన మెగా ఫ్యామిలీ, ఇతర సెలబ్రిటీలు రామ్ చరణ్, దిల్ రాజు, శంకర్ కు కంగ్రాంట్స్ చెబుతూ సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు.