“హిట్ 3″కి ముహూర్తం రెడీ

నాని(Nani) హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఈలోగా తన కొత్త సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు నాని రెడీ అవుతున్నారు. హిట్ ఫ్రాంఛైజీలో మూడో సినిమా హిట్ 3(HIT 3)కి నాని మూహుర్తం పెట్టారు. సెప్టెంబర్ 5వ తేదీన హిట్ 3 సినిమా లాంఛనంగా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శైలేష్ కొలను(Sailesh kolanu) ఈ సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ గా నాని కనిపించనున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా నటించిన హిట్(HIT), అడివి శేష్ హీరోగా నటించిన హిట్ 2(HIT 2) సినిమాలు సక్సెస్ అయిన నేపథ్యంలో హిట్ 3పైనా అంచనాలు ఉన్నాయి. అయితే దర్శకుడు శైలేష్ వెంకటేష్ తో చేసిన సైంధవ్ సినిమా ఫ్లాప్ కావడం హిట్ 3పై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. తనకు కలిసొచ్చిన హిట్ ఫ్రాంఛైజీని సక్సెస్ ఫుల్ గా దర్శకుడు శైలేష్ కంటిన్యూ చేస్తాడనే నాని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు.