‘వీరమల్లు..’లో పవన్ పాడిన పాట వచ్చేస్తోంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో చేస్తోన్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి ముందుగా దర్శకుడు క్రిష్. ఆయన సినిమాలన్నీ డిపరెంట్ గా ఉంటాయి. అయితే.. ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని ఆయన తప్పుకోవడంతో జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఏఎం రత్నం ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కు ఇందులో జంటగా నిధి అగర్వాల్ నటిస్తోంది. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న వీరమల్లు ఇప్పుడు అప్ డేట్ ఇచ్చాడు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను జనవరి 6న ఉదయం 9 గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. మాట వినాలి..అంటూ సాగే ఈపాటను పవన్ పాడటం విశేషం.

కొత్త సంవత్సరంలో వీరమల్లు నుంచి అప్ డేట్ రావడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా రిలీజ్ చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ ను మార్చి 28న విడుదల చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించారు. ఆతర్వాత వీరమల్లు సైలెంట్ అవ్వడంతో వస్తుందా..? వాయిదా పడనుందా..? అనేది సస్పెన్స్ గా ఉండేది. ఇప్పుడు మరోసారి వీరమల్లు రాకను కన్ ఫర్మ్ చేశారు. దీంతో వీరమల్లు రావడం పక్కా అనేది కన్ ఫర్మ్ అయ్యింది. ఈ భారీ పీరియాడిక్ మూవీకి ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ కావడంతో వీరమల్లుకు ప్లస్ అని చెప్పచ్చు. పవర్ స్టార్ ఫ్యాన్స్ పవన్ ను థియేటర్లో చూడాలని ఎదురు చూస్తున్నారు.