“దేవర” ట్రైలర్ వచ్చేది ఆరోజే

ఎన్టీఆర్(NTR) హీరోగా నటిస్తున్న దేవర(Devara) సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ నెల 10న దేవర ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ రోజు దేవర ట్రైలర్(Devara Trailer) అనౌన్స్ మెంట్ ను పవర్ ఫుల్ పోస్టర్ తో ఇచ్చారు మేకర్స్. రెండు భాగాలుగా దర్శకుడు కొరటాల శివ(Koratala siva) రూపొందిస్తున్న దేవర సినిమా పార్ట్ 1 ఈ నెల 27న థియేటర్స్ లోకి రాబోతోంది.

రిలీజ్ కు టైమ్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో దేవర ట్రైలర్ పై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ట్రైలర్ లో యాక్షన్ పార్ట్ ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటుంది…అయితే మిగతా ఏ ఎలిమెంట్స్ కొత్తగా చూపిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. దేవర మ్యూజిక్ ప్రమోషన్స్ మిక్స్డ్ రెస్పాన్స్ తో సాగుతున్నాయి. ఫస్ట్ పాటకు విమర్శలు రాగా..సెకండ్ సాంగ్ చుట్టమల్లే(Chuttamalle song) హిట్ అయ్యింది. ఇప్పుడ థర్డ్ సాంగ్ కూడా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు దేవర ట్రైలర్ తో ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయాలని మూవీ టీమ్ భావిస్తోంది.