దసరా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను కేరళ పోలీసులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు. ఇటీవల కేరళలోని ఓ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆ హోటల్ పై దాడి చేయగా..తప్పించుకుని పారిపోయాడు షైన్ టామ్ చాకో. పోలీసుల రైడ్ నుంచి తప్పించుకున్నా, అతనికి డిపార్ట్ మెంట్ నుంచి నోటీసులు వెళ్లాయి.
ఈ రోజు తన లాయర్ తో కలిసి ఎర్నాకుళం పోలీసుల విచారణకు హాజరయ్యాడు షైన్ టామ్ చాకో. నాలుగు గంటల పాటు అతన్ని విచారించిన పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకుని తనను లైంగికంగా వేధించాడంటూ హీరోయిన్ విన్సీ సోనీ అక్కడి నటీనటుల సంఘం, ఫిలింఛాంబర్ లో కంప్లైంట్ దాఖలు చేసింది.