ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆహా ఓటీటీ సక్సెస్ ఫుల్ డ్యాన్స్ షో “డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” ఫస్ట్ ఎపిసోడ్ నుంచే ప్రేక్షకుల్ని సర్ ప్రైజ్ చేస్తోంది. ఈ షో సెకండ్ వీక్ నామినేషన్స్ స్టార్ట్ కావడంతో “డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్” లో అసలైన ఆట మొదలైంది. రివేంజ్ తీర్చుకుంటూ పంచభూతాలైన గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ విపుల్ కాండ్పాల్, సాధ్వి మజుందార్, బినితా చెట్రీ, షోనాలి మరియు బర్కత్ అరోరాలను ఐదుగురు మెంటార్స్ మానస్, దీపిక, జాను లైరి, ప్రకృతి, యష్ మాస్టర్ ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
టీమ్ ఎర్త్ మెంటార్ ప్రకృతి కంబం.. మానస్ నాగులపల్లి టీమ్ ‘ఫైర్’ ని నామినేట్ చేసింది. రివేంజ్ గా ప్రకృతి మెంటార్ గా ఉన్న ఎర్త్ ని మానస్ నామినేట్ చేయడం హీట్ పెంచింది. యష్ మాస్టర్, దీపికా జానులైరి ‘వాటర్’ ను నామినేట్ చేయగా, ప్రతీకారంగా జనులైరి, దీపిక ‘ఎయిర్’ ను నామినేట్ చేసింది. యశ్ మాస్టర్ ‘స్కై’ మాత్రం నామినేషన్స్ నుంచి బయటపడింది. డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ షో లో మరింత ఎంటర్ టైన్ మెంట్ రాబోయో ఎపిసోడ్స్ లో ప్రేక్షకుల కోసం రెడీగా ఉంది.