తిరుపతిలో ఘోర విషాదం చోటు చేసుకున్న నేపథ్యంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశారు. అనంతపురంలో ఈ ఈవెంట్ ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. మంత్రి లోకేష్ ఈ కార్యక్రమానికి అతిథిగా రావాల్సిఉంది. అయితే తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయి, 40 మందికి పైగా గాయపడ్డారు.
ఈ ఘటన పట్ల ఏపీ ప్రభుత్వం తమ విచారాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి సందర్భంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం సరికాదని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ ప్రకటన సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. డాకు మహారాజ్ సినిమాను దర్శకుడు బాబీ రూపొందించారు. శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ నెల 12న ఈ సినిమా రిలీజ్ కు రాబోతోంది.