బ్రో పై విమర్శలు.. ఖండించిన నిర్మాత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పై వైసీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోకి హవాలా డబ్బు పెట్టుబడులుగా పెట్టారని వైకాపా మంత్రి అంబటి రాంబాబు ఆరోపించడం సంచలనం అయ్యింది. అమెరికాలో తెలుగుదేశం పార్టీ కలెక్ట్ చేసిన డబ్బు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీ ద్వారా ఇండియాకు రీరూటింగ్ చేస్తున్నారని.. ఇక్కడ సినిమాలో పెట్టుబడి పెట్టారని అంబటి ఆరోపించారు. అంతే కాకుండా దీని పై ఈడీకి ఫిర్మాదు చేస్తామని కూడా అన్నారు.

ఇదే విషయం గురించి నిర్మాత విశ్వప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాలో బిజినెస్ చేస్తున్న‌ప్పుడు దానికి కావాల్సిన నియ‌మాలు అన్నీ పాటిస్తాం. అమెరికా నుంచి తెచ్చే డ‌బ్బుకు ఆర్బీఐ నుంచి స్ప‌ష్ఠంగా లెక్క తేలాకే తెస్తాం. స్థానికంగా తెచ్చే దానికి లెక్క‌లుంటాయి. జీఎస్టీ క‌డ‌తామ‌ని తెలిపారు. నాకు భాజ‌పా స‌హా అన్ని పార్టీల నాయ‌కుల‌తో స‌త్సంబంధాలున్నాయి. నాకు డ‌బ్బును రీరూటింగ్ చేయాల్సిన ప‌ని లేదు. నా బిజినెస్ లు నేను చేయ‌గ‌ల‌ను.. డ‌బ్బును రూటింగ్ చేయాల్సిన ప‌ని లేదు. ఐదేళ్లుగా సినిమా వ్యాపారంలో ఉన్నాం. పాతిక సినిమాలు చేసాం అని కూడా అన్నారు. రోజురోజుకు బ్రో వివాదస్పం అవుతుంది. మరి.. ఇది ఎంత వరకు వెళుతుందో చూడాలి.