టాలీవుడ్ రీసెంట్ హిట్ మూవీ కోర్ట్ ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రియదర్శి, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి, శివాజీ కోర్ట్ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించారు.
రామ్ జగదీశ్ ఈ చిత్రంతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు. నాని నిర్మించిన కోర్ట్ సినిమా గత నెల 14న థియేటర్స్ లోకి వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనూ ఈ సినిమా ట్రెండ్ కానుంది. కోర్ట్ సినిమాలో సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర అనింగి తదితరులు నటించారు.