సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా కపుల్ ఫ్రెండ్లీ. ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ చిత్రంగా తెరకెక్కుతున్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మూవీ టీమ్ తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ఈ సినిమా టైటిల్ కొత్తగా ఉండి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా వీడియో గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చెన్నై నేపథ్యంగా ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ను ఈ సినిమా ఇవ్వనుందనే వైబ్ ఏర్పడుతోంది. ఈ సినిమా తెలుగు,తమిళ ఆడియో రైట్స్ ను ఫ్యాన్సీ రేట్ కు ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకురాబోతోంది.