బాక్సాఫీస్ వార్ కు సిద్ధమైన “కూలీ”

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఆగస్టు 14న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ డేట్ అనౌన్స్ మెంట్ తో బాక్సాఫీస్ వార్ కు తాము రెడీ అయినట్లు చెప్పేశారు కూలీ టీమ్. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14నే రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాతో క్లాష్ వద్దని, వారం రెండు వారాల తర్వాత సినిమాను రిలీజ్ చేయాలనే ప్రతిపాదన కూలీ టీమ్ లో వచ్చింది. అయితే మేకర్స్ అదే రోజున సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. సన్ పిక్చర్స్ నిర్మాణంలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూలీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు వార్ 2 సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉంది.