నాగబాబు ముద్దుల కూతురు నిహారిక, చైతన్య జొన్నలగ్డను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత బాగానే ఉన్నారు కానీ.. ఏమైందో ఏమో విడాకులు తీసుకున్నారు అనే వార్త బయటకు రాగానే అంతా షాక్ అయ్యారు. గత కొంతకాలంగా నిహారిక విడాకుల గురించి వార్తాకథనాలు వస్తున్నాయి కానీ.. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదు. నిజం కాకపోతే.. ఓ రేంజ్ లో ఫైర్ అయ్యేవారు. నిజం కాబట్టే సైలెంట్ గా ఉన్నారని.. అనుమానాలు మరింత పెరిగాయి. దీనికి తోడు నిహారిక గత కొన్ని రోజుల నుంచి యాక్టింగ్ పై కాన్ సన్ ట్రేషన్ చేస్తుంది.
ఇప్పుడు వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకకు నిహారిక వచ్చింది కానీ.. ఆమె భర్త చైతన్య రాలేదు. దీంతో విడిపోయారు అనే వార్త నిజమే అని.. అనుమానాలకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది. ఇన్ స్టాలో నిహారిక పోస్ట్ చేసిన ఫోటోల్లో ఎక్కడా ఆమె భర్త కనిపించలేదు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. దేనికైనా ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పడాలి. అలా పడాలంటే… సంబంధిత వ్యక్తులు క్లారిటీ ఇవ్వాలి. మరి.. త్వరలో నిహరిక కానీ.. నాగబాబు కానీ.. క్లారిటీ ఇస్తారేమో చూడాలి.