కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఇక లేరు

ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఈరోజు మరణించారు. ఆయన వారం రోజుల క్రితం వైజాగ్ లో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఓ ప్రైవేట్ హాస్పటల్ లో చికిత్స తీసుకున్నారు అయితే.. ఈ రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గాంధీ హాస్పటల్ కి మధ్యాహ్నం తీసుకెళ్లారు. అయితే.. మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. దీంతో వైద్యులు రాకేష మాస్టర్ ను కాపాడేందుకు శతవిధాల ప్రయత్నం చేశారు కానీ.. ఫలితం దక్కలేదు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని డాక్టర్లు ధృవీకరించారు.

1968 తిరుపతిలో జన్మించిన రాకేష్ మాస్టర్ కి నలుగురు అక్కలు, ఒక అక్క, అన్న, తమ్ముడు ఉన్నారు. టాలీవుడ్ లో ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు రాకేష్ మాస్టర్. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కు డ్యాన్స్ నేర్పింది రాకేష్ మాస్టరే. సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, చిరునవ్వుతో తదితర చిత్రాలకు కొరియోగ్రఫీ అందంచిన రాకేష్ మాస్టర్ ఇటీవల కాలంలో సినిమాకు దూరంగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఈమధ్య బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సినీ ప్రముఖులు సంతాంప వ్యక్తం చేశారు.