డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమవుతున్న “తంగలాన్”

చియాన్ విక్రమ్(Chiyaan vikram) హీరోగా నటించిన తంగలాన్(Thangalaan) సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. ఇప్పటికే ఓవర్సీస్ ఆడియెన్స్ కు అందుబాటులోకి వచ్చింది తంగలాన్. ఈ నెల 20వ తేదీన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని సమాచారం. అఫీషియల్ అనౌన్స్ మెంట్ నెట్ ఫ్లిక్స్(Netflix) చేయబోతోంది.

ఇక హిందీ వెర్షన్ మాత్రం మరో వారం రోజుల తర్వాత నుంచి అంటే ఈ నెల 27వ తేదీ నుంచి ఉంటుందని తెలుస్తోంది. గత నెల 15వ తేదీన తంగలాన్ సినిమా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా(KE Jnanavel raja) నిర్మించగా..దర్శకుడు పా రంజిత్(Pa ranjith) తెరకెక్కించారు. మాళవిక మోహనన్(Malvika mohanan), పార్వతీ తిరువోతు హీరోయిన్స్ గా నటించారు.