మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమా చూడాలని ఉంది రిలీజై ఇవాళ్టికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా పోస్టర్స్, వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. చూడాలని ఉంది సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ మెమొరబుల్ అకేషన్ ను ట్వీట్ చేసింది. కాలం ఎంత వేగంగా ప్రయాణించినా కొన్ని కథలు మన మనసుకు హత్తుకునే ఉంటాయి ట్వీట్ లో పేర్కొంది. మరోవైపు దర్శకుడు గుణ శేఖర్ కూడా చూడాలని ఉంది 25 ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
1998 జూలై 27న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణతో ఘన విజయాన్ని అందుకుంది. అప్పట్లో మూవీ సక్సెస్ ను శత దినోత్సవ కేంద్రాల్లో చెప్పేవారు. ఎన్ని సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ ఆడితే ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ అయినట్లు. అలా…చూడాలనిఉంది సినిమా 63 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన అంజల జవేరి, సౌందర్య హీరోయిన్స్ గా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించారు. మణిశర్మ పాటలు ఈ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాయి.