కీర్తితో నటించాలని చిరు కోరిక

ఈ మధ్య భోళా శంకర్ ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి తరుచూ చెబుతున్న మాట కీర్తి సురేష్ తో హీరోగా నటించాలని ఉందని. చెల్లి అని పిలిచిన తనను చెలి, సఖి అని పిలవకూడదా? అంటూ అడిగారు. గతంలో ఎన్టీఆర్, సావిత్రి అన్నా చెల్లెలుగా నటించి ఆ తర్వాత సక్సెస్ ఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారని చిరు గుర్తు చేశారు. ఇక నిన్న ప్రీ రిలీజ్ కార్యక్రమంలోనూ ఇంత అందమైన అమ్మాయి నన్ను అన్న అని పిలుస్తుంటే కలుక్కుమనేది అని అన్నారు. కీర్తికి చాలామంది అన్నయ్యలు ఉన్నారు చాలు…మనం నెక్ట్ పిక్చర్ లో పెయిర్ గా చేద్దామంటూ చెప్పేశారు చిరంజీవి. కీర్తి నట ప్రతిభను, అందాన్ని మెచ్చుకుంటూ మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటన చూసి ఆమెకు జాతీయ అవార్డ్ వస్తుందని చెప్పానని చిరంజీవి తెలిపారు. తాను అన్నట్లుగానే ఆమెకు జాతీయ అవార్డ్ వచ్చిందని, అప్పుడెంతో సంతోషించానని ఆయన అన్నారు.

మెగాస్టార్ మాటల్లో వింటే….కీర్తి అందమైన హీరోయిన్, చాలా టాలెంటెడ్. తను ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు ఇచ్చిన ఇన్ పుట్స్, ఇన్వాల్వ్ మెంట్ సీన్స్ బాగా వచ్చేందుకు ఎంతో ఉపయోగపడింది. కానీ తాను అన్నయ్య అని పిలుస్తుంటే ఇబ్బందిగా ఉండేది. నెక్ట్ సినిమాలో నాతో హీరోయిన్ గా చేయబోతోంది. నటిగా ఆమె ఎదుగుతున్న తీరు చూస్తున్నా. మహానటి సినిమా చూసి యూనిట్ మొత్తాన్ని ఇంటికి పిలిచి అభినందించా. అప్పుడు కీర్తి వేరే సినిమా లొకేషన్ లో ఉండి రాలేకపోయింది. మహానటి సినిమాలో నా అభిమాన నటి సావిత్రికి ప్రతిరూపంగా మారిపోయింది. అన్నారు.