విశ్వంభర సినిమా షూటింగ్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి యూఎస్ హాలీడే ట్రిప్ కు వెళ్లారు. భార్య సురేఖతో కలిసి యూఎస్ బయలుదేరిన చిరంజీవి..విమానంలో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు. ఇది షార్ట్ ట్రిప్. త్వరలోనే తిరిగి వచ్చి విశ్వంభర కొత్త షెడ్యూల్ లో పాల్గొంటానని చిరంజీవి తన పోస్ట్ లో పేర్కొన్నారు. హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్.
విశ్వంభర సినిమా సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా హైదరాబాద్ లో ముగిసింది. ఇందులో కీలక యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించారు. మూడో షెడ్యూల్ త్వరలో బిగిన్ కానుంది. ఈ గ్యాప్ లో హాలీడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు చిరంజీవి. భారీ సోషియో ఫాంటసీ మూవీగా విశ్వంభర తెరకెక్కుతోంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజ్ కానుంది.