‘డాకూ..’ దర్శకుడితో చిరు సినిమా

మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు. బింబిసార సినిమా చేసిన మల్లిడి వశిష్ట్ తో విశ్వంభర అనే సినిమా చేస్తున్నారు. దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమాను అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఉగాదికి ఈ సినిమాను ప్రారంభించి..జూన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనేది ప్లాన్. తాజాగా మరో యంగ్ డైరెక్టర్ బాబీతో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట మెగాస్టార్.

గతంలో బాబీ డైరెక్షన్ లో చిరు వాల్తేరు వీరయ్య అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఫర్వాలేదనిపించింది. ఆ తర్వాత మరోసారి కలిసి సినిమా చేయాలి అనుకున్నారు. బాలకృష్ణతో డాకు మహారాజ్ మూవీ తెరకెక్కించిన బాబీ ఇప్పుడు మెగాస్టార్ కోసం కథ రెడీ చేశాడట. ఇటీవల చిరుకు బాబీ కథ చెబితే.. బాగుంది.. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ ఫర్మ్ అయ్యిందని.. నెక్ట్స్ ఇయర్ ఈ సినిమాని స్టార్ట్ చేస్తారని టాక్. అయితే.. ఈ చిత్రాన్ని నిర్మించే నిర్మాత ఎవరు..? అనేది తెలియాల్సివుంది.