చరణ్ కి విలన్ విజయ్ సేతుపతే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఓ సినిమా రూపొందనుందనే విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సతీష్ నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఈ సినిమాని ప్రకటించారు కానీ.. ఇంత వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. మరో వైపు ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఎప్పుడెప్పుడు అప్ డేట్ ఇస్తారా అని మెగా అభిఆమానులు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ షూటింగ్ లో ఉన్న చరణ్ జనవరి నుంచి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

ఈ మూవీ అప్ డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతిని కాంటాక్ట్ చేశారట. క్యారెక్టర్ నచ్చడంతో ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పాడట. ఉప్పెనలో విజయ్ సేతుపతి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇందులో కూడా మంచి పేరు వచ్చేలా క్యారెక్టర్ ను డిజైన్ చేశాడట. ఈ నెలాఖారున ఈ మూవీ కోసం ఆఫీస్ తీసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఇందులో హీరోయిన్ ఎవరు అనేది ఫైనల్ కాలేదు కానీ.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.