చరణ్‌, బుచ్చిబాబు మూవీ ఇంట్రస్టింగ్ న్యూస్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తుందనుకున్న గేమ్ ఛేంజర్ సమ్మర్ తర్వాత విడుదల కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ సినిమాతో పాటు చరణ్‌ బుచ్చిబాబు సానతో కూడా సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మించనున్నారు. అయితే.. ఈ సినిమాని ప్రకటించి చాలా రోజులు అయ్యింది కానీ.. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్ళనుందో అనౌన్స్ చేయలేదు.

అయితే.. ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్యాన్ ఇండియా రేంజ్ లో తీయబోయే ఈ స్పోర్ట్స్ కం యాక్షన్ డ్రామాకు మూడు వందల కోట్ల బడ్జెట్ కేటాయించారట. విజయ్ సేతుపతిని లాక్ చేశారని, షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యాక అప్పుడు ఆయన అందుబాటుని బట్టి కాల్ షీట్స్ ప్లాన్ చేయాల్సి ఉంటుందట. ఉప్పెనతో తనకు మంచి పేరు తీసుకువచ్చిన బుచ్చిబాబు.. ఈ సినిమాలో అంతకు మించిన పాత్రను డిజైన్ చేయడంతో వెంటనే ఓకే చెప్పాడట.

మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఏంటంటే.. సీనియర్ హీరోయిన్ లయకు కీలక పాత్ర ఇచ్చారని తెలిసింది. ఈ క్యారెక్టర్ చాలా షాకింగ్ గా ఉంటుందట. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే.. ఏఆర్ రెహమాన్ ని ఫైనల్ చేశారట. ఇటీవలే ఓ ఇంటర్ వ్యూలో రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ ఇస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. రెహమాన్ నుంచి బెస్ట్ ఆల్బమ్ ను బుచ్చిబాబు ఎలా రాబడతాడు అనేది ఆసక్తిగా మారింది. మరి.. ఈ సినిమాను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకువస్తారంటే.. గేమ్ ఛేంజర్ పూర్తైన తర్వాత అని టాక్ వినిపిస్తోంది. గేమ్ ఛేంజర్ ఫిబ్రవరికి కంప్లీట్ అవుతుందని.. ఆతర్వాత ఈ సినిమా స్టార్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో క్లారిటీగా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.