డైరెక్టర్ వీఎన్ ఆదిత్య థ్రిల్లర్ మూవీలో కేథరీన్ ట్రెసా

పైసా, ఇద్దరమ్మాయిలతో, సరైనోడు(Sarrainodu) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా(Catherine tresa). ఈ హీరోయిన్ టాలెంటెడ్ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య(VN Aditya) దర్శకత్వం వహిస్తున్న థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రంలో కేథరీన్ ట్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్‌(OMG productions) బ్యానర్ పై, ఏయు & ఐ సమర్పణ లో డాక్టర్‌ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు.

ఈ రోజు కేథరీన్ ట్రెసా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో కేథరీన్ ట్రెసా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఇండియాతో పాటు పలువురు కొత్త విదేశీ నటీనటులు నటిస్తుండటం విశేషం. ఈ సినిమాను యూఎస్ లోని డల్లాస్‌లో చిత్రీకరిస్తారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.