ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్.. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పుష్ప సినిమాకి ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా నార్త్ లో పుష్ప చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప 2 కథను రెడీ చేశారట. ఎవరు ఎన్ని అంచనాలతో వచ్చినా వావ్ అదిరింది అనేలా కథను రెడీ చేశారట సుకుమార్. ఈ భారీ పాన్ ఇండియా మూవీని వచ్చే సమ్మర్ లో విడుదల చేయనున్నారు.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రంలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగానే పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో ఈ చిత్రాన్ని కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. ఈ సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.
ఇక అసలు విషయానికి వస్తే.. పుష్ప 2 సినిమాను కూడా ఏప్రిల్ లోనే విడుదల చేయాలి అనుకుంటున్నారట. డేట్ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు కానీ.. ఎన్టీఆర్ దేవర, బన్నీ పుష్ప 2 ఒకే నెలలో రెండు వారాల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయట. ఎన్టీఆర్, బన్నీ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ ఒకరినొకరు బావ అని పిలుచుకుంటారు. అంత క్లోజ్ రిలేషన్ ఉన్న ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర పోటీపడడం ఆసక్తిగా మారింది. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా దేవర, పుష్ప 2 పోటీపడితే.. సినిమా భారీ విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి.