ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకి గాను జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డ్ అందుకుని చరిత్ర సృష్టించాడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ అందుకున్న తొలి తెలుగు హీరోగా హిస్టరీ క్రియేట్ చేయడంతో పుష్ప 2 పై మరింతగా అంచనాలు పెరిగాయి. అయితే.. సంతోషాన్ని పంచుకునేందుకు అసలు సిసలైన పార్టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడట. ఈ పార్టీ అలాంటి ఇలాంటి పార్టీ కాదని.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా పార్టీని ప్లాన్ చేశాడని వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ విషయం ఏంటంటే… ఇండస్ట్రీలోని ప్రముఖులు అందర్నీ పార్టీకి ఆహ్వానిస్తున్నాడట. ఈ వారంలోనే ఈ సర్ ఫ్రైజ్ పార్టీ ఉంటుందని తెలిసింది. ఈ పార్టీలో పుష్ప కోసం పని చేసిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా సత్కరించాలని అనుకుంటున్నాడట. వాళ్ల కోసం ప్రత్యేక బహుమతులు కూడా రెడీ అయ్యాయట. అంతే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ నుంచి కూడా తన మిత్రులను ఈ పార్టీకి ఆహ్వానిస్తున్నాడట. టాలీవుడ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ పార్టీని ప్లాన్ చేస్తున్నాడట. అయితే.. ఈ పార్టీ ఎప్పుడు..? ఎక్కడ..? అనేది త్వరలోనే తెలుస్తుంది.