మెగాస్టార్ మీద అంత బడ్జెట్ వర్కవుట్ కాదా ?

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ ఉండానే.. రెండు, మూడు సినిమాలు కన్ ఫర్మ్ చేస్తున్నాడు. ప్రస్తుతం విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉండగానే..అనిల్ రావిపూడితో సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. జూన్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కానుంది. మరో వైపు దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమాను అనౌన్స్ చేశారు. అయితే.. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది తెలియాల్సివుంది.

ఇక చిరు కోసం డైరెకట్ర్ బాబీ ఓ కథ రెడీ చేస్తున్నాడట. చిరు కూడా బాబీతో మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇద్దరి మధ్య కథాచర్చలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే.. ఇప్పుడు చిరు, బాబీ సినిమాకి నిర్మాత ఎవరు అనేది ప్రశ్నగా మారిందట. కారణం ఏంటంటే.. బాబీ బడ్జెట్ట్ పెంచేస్తుంటాడు అనే టాక్ ఉంది. పైగా చిరు రెమ్యూనరేషన్ 75 కోట్లు, బాబీ 15 కోట్లు ఇద్దరికి కలిపే 90 కోట్లు.. నిర్మాణం 85 కోట్లు.. అంటే.. 175 కోట్లు బడ్జెట్ అవుతుంది. పైగా లాభాల్లో వాటా ఇవ్వాలట. చిరుతో అంత బడ్జెట్ పెట్టి రిస్క్ చేస్తే.. లాభాల్లో వాటా ఇవ్వాలనే ఉద్దేశ్యంతో నిర్మాత డీవీవీ దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇంట్రెస్ట్ చూపించడం లేదట.