నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “బడ్డీ”

అల్లు శిరీష్(Allu sirish) హీరోగా నటించిన బడ్డీ(Buddy) సినిమా నెట్ ఫ్లిక్స్(Netflix) లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. నేటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడలో స్ట్రీమింగ్ అవుతోంది. వాచ్ నౌ అంటూ నెట్ ఫ్లిక్స్ బడ్డీ స్ట్రీమింగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేసింది. బడ్డీ సినిమా అడ్వెంచర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చింది. పిల్లలతో పాటు పెద్దల్ని ఆకట్టుకుంది.

బడ్డీలో టెడ్డీ బేర్ క్యారెక్టర్ చేసిన ఫన్, యాక్షన్ అందరినీ ఎంటర్ టైన్ చేసింది. బడ్డీ సినిమాను దర్శకుడు సామ్ ఆంటోన్(Sam anton) రూపొందించారు. స్టూడియో గ్రీన్ బ్యానర్(Studio green) పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా(Jnanavel raja) నిర్మించారు. గాయత్రి భరద్వాజ్(Gayatri Bharadwaj), ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్స్ గా నటించారు. బడ్డీ నెట్ ఫ్లిక్స్ లో సకుటుంబంగా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది.