పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ఈ నెల 28న బ్రో మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా బ్రో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇందులో పవన్ దేవుడు పాత్ర చేసినప్పటికీ.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ గా తీర్చిదిద్దారు. పవన్ చాలా యాక్టీవ్ గా.. ఇంకా చెప్పాలంటే.. ఫ్యాన్స్ కి, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా కనిపించారు.
సినిమా ఎలా ఉండబోతుంది అనేది పక్కన పెడితే.. ట్రైలర్ మాత్రం అదిరింది అనేలా ఉంది. ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్, సస్పెన్స్.. ఇలా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నట్టుగా అనిపిస్తుంది. సముద్రఖని ఈ సినిమా గురించి చెబుతూ త్రివిక్రమ్ పది నిమిషాల్లో మొత్తం మార్చేశారు అని చెప్పారు. ట్రైలర్ ను చూస్తుంటే.. అది నిజమే అనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటి వరకు బ్రో మూవీ పై అంతగా బజ్ లేదు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది అనేది వాస్తవం. మరి.. 28న థియేటర్లో బ్రో ఏం చేస్తాడో… ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.