ప్రమోషన్స్ లో స్పీడు పెంచిన బ్రో మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ బ్రో. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు బ్రో మూవీతో వస్తుండడంతో మరింత ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ నెల 28న బ్రో మూవీని విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్.

ఇటీవల మై డియర్ మార్కాండేయ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు. జాణవులే అంటూ సాగే ఈ రొమాంటిక్ సాంగ్ ను రేపు తిరుపతిలోని ఎన్వీఆర్ జయశ్యామ్ థియేటర్ లో ప్రేక్షకుల నడుమ లాంచ్ చేయనున్నారు. జులై 15న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఈ వేడుక షురూ కానుంది. ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. దీంతో భారీ టార్గెట్ తో బ్రో వస్తున్నాడు. మరి… బ్రో బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి.