పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందిన భారీ, క్రేజీ మూవీ బ్రో. ఈ మూవీకి సముద్రఖని డైరెక్టర్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ నెల 28న బ్రో మూవీ విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు మేకర్స్. వారాహి యాత్రలో ఉన్నారు. అందుచేత బ్రో మూవీ గురించి ఏం చెబుతారు..? ఆయన స్పీచ్ ఎలా ఉండబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీజనాలు.
ఇప్పుడు బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో 25 సాయంత్రం గ్రాండ్ గా ఈ వేడుక నిర్వహించబోతున్నారని సమాచారం. ఛీఫ్ గెస్టుగా ఎవరు వస్తారనే విషయం మీద పెద్దగా సస్పెన్స్ అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ తో పాటు సినిమాలో నటించిన తారాగణం తప్ప ఇంకెవరూ ముఖ్య అతిథులు ఉండరని తెలిసింది. ఎవరు వచ్చినా మూవీతో పాటు జనసేన గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టడం కన్నా కేవలం క్యాస్టింగ్ కే పరిమితం చేయాలని పవన్ కోరినట్టు సమాచారం.
బిజినెస్ మాత్రం క్రేజీగానే జరుగుతోంది. దాదాపు 100 కోట్లకు పైగా బిజినెస్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు టిక్కెట్ల హైక్ లేకపోయినా తొంబై కోట్ల దాకా రాబట్టాయి. బ్రో సైతం ఇదే దారి పట్టక తప్పేలా లేదు. మరి.. బ్రో బాక్సాఫీస్ దగ్గర ఎంత వరకు మెప్పిస్తాడో.. ఎంత కలెక్ట్ చేస్తాడో అనేది అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది.