బ్రో రన్ టైమ్ ఎంతో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న మూవీ బ్రో. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్ అయితే.. మాటల మాంత్రికుడు స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ అండ్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ నెల 28న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అయితే.. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ లో స్పీడు పెంచారు.

ఇక ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. రన్ టైమ్ ఎంతంటే.. ఈ చిత్రం 134.30 నిమిషాల నిడివి అని తెలిసింది. అంటే.. రెండు గంటల పథ్నాలుగు నిమిషాల ముప్పై సెకండ్స్. రన్ టైమ్ కాస్త తక్కువే ఉండడం సినిమాకి ప్లస్ అని చెప్పచ్చు. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ లేడీ లీడ్ రోల్స్ లో నటించారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మేనమామ, మేనల్లుడు కలిసి చేసిన సినిమా కావడంతో కామన్ ఆడియన్స్ లో సైతం ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది.