పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మూవీ బ్రో. ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించగా, టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ నెల 28న బ్రో మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈరోజు బ్రో ప్రీ రిలీజ్ వేడుక శిల్ప కళావేదికలో నిర్వహించారు.
అయితే.. ఈ సినిమాకి భారీ వర్షాల బెంగపట్టుకుంది. వాయువ్య బంగాళాఖాతంలోని ఉపరిత ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యంత భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మూడు రోజులు పాటు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ తెలియచేసింది. ఇలాగే భారీ వర్షాలు పడితే ఖచ్చితంగా బాక్సాఫీస్ పై ప్రభావం ఉంటుంది. పని ఉంటేనే తప్పితే బయటకు రావద్దు అని ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. అందుకనే బ్రో మేకర్స్ లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. మరి.. శుక్రవారం నాటికి పరిస్థితి ఇలాగే ఉంటుందో..? చక్కబడుతుందో..? చూడాలి
.