పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో దర్శకుడు సముద్రఖని రూపొందించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. భారీ అంచనాల మధ్య గత నెల రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు.
టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ మొదలైంది. కథపై కాకుండా పవన్ ఇమేజ్ మీదే ఎక్కువ ఆధారపడటంతో సినిమా యావరేజ్ గా తయారైందన్న విమర్శలు వచ్చాయి. ఇక బ్రో సినిమా డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. జీ5 ఓటీటీ ద్వారా ఈ నెల 25న ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోందని సమాచారం.
ఈ విషయంపై నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ప్రకటన చేయాల్సి ఉంది. ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. పవన్ జనసేన ప్రచారంలో భాగంగా వారాహి యాత్ర చేస్తుండటంతో …బ్రో రిలీజ్ సందర్భంగా ఏపీ నాయకులు ఈ సినిమా మీద, పవన్ రెమ్యునరేషన్ మీదా విమర్శలు, కాంట్రవర్సీస్ క్రియేట్ చేశారు. మొత్తానికి పవన్ తో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మెమొరబుల్ మూవీ కాలేకపోయింది