పవన్ షూట్ కు బ్రేక్. అసలు ఏమైంది..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలు హరి హర వీరమల్లు(Hari Hara veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagatsingh), ఓజీ(OG) సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాల నిర్మాతలు పవన్ కళ్యాణ్‌ ఎప్పుడెప్పుడు డేట్స్ ఇస్తాడా..? షూటింగ్స్ కంప్లీట్ చేద్దామా.. అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ నుంచి పవన్ డేట్స్ ఇచ్చాడని టాక్ వినిపించింది. ఇప్పుడు పవన్ షూటింగ్స్ కి మళ్లీ బ్రేకులు పడ్డాయని ప్రచారం జరుగుతోంది. అసలు ఏమైంది.? పవన్ షూట్ లో జాయిన్ అయ్యేది ఎప్పుడు..?

పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల ముందు షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు. ఎన్నికల అనంతరం షూటింగ్ లో జాయిన్ అవుతారని పవన్ తో సినిమాలు చేస్తోన్న నిర్మాతలు ఎదురు చూశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసి నిర్మాతలు డేట్స్ అడిగితే.. పాజిటివ్ గా స్పందించారు. తను ఉంటున్న తాడేపల్లి సమీపంలో షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటే.. వెంటనే డేట్స్ ఇస్తానని అన్నారు. వీరమల్లు చిత్ర నిర్మాత ఏఎం రత్నం పవన్ చెప్పినట్టుగానే అక్కడ భారీ సెట్స్ వేశారు. అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్‌ వీరమల్లు షూట్ లో జాయిన్ అవుతారని టాక్ వినిపించింది. అయితే.. ఇప్పుడు ప్లాన్ మారింది.. పవన్ షూటింగ్ కి బ్రేక్ పడిందని సమాచారం.

అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలలు షూటింగ్ చేయాలని పవన్ అనుకున్నారట. ఫిట్ గా ఉండడం కోసం కసరత్తు కూడా చేయాలని ఫిక్స్ అయ్యారు. మళ్లీ పవన్ షూటింగ్స్ స్టార్ట్ చేయనున్నారని.. త్వరలో పవన్ సినిమా థియేటర్స్ లోకి వస్తుందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే.. పవన్ షూటింగ్స్ కు వరదలు బ్రేక్ వేశాయి. ఏపీ వరదలతో అల్లాడిపోతుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రజలను చూసుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగింది. అందుచేత పరిస్థితులును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అధికారులతో గడుపుతున్నారు. అందుచేత ఇప్పట్లో పవన్ షూటింగ్స్ లో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఎప్పుడు పరిస్థితులు సర్థుమణుగుతాయో అప్పుడు పవన్ డేట్స్ ఇస్తారు. సో.. పవన్ షూటింగ్స్ గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.