బాలీవుడ్ టైమ్ బాగుంది, మరో హిట్ దక్కింది

సక్సెస్ లేక ఢీలా పడిన బాలీవుడ్ కు ఒక్కొక్కటిగా సూపర్ హిట్ సినిమాలు దక్కుతున్నాయి. ఇటీవల కార్తీక్ ఆర్యన్, కియారా అద్వాని సత్య ప్రేమ్ కి కథ, రణవీర్, ఆలియా భట్ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ వంటి మూవీస్ ఘన విజయాలు సాధించాయి. నిన్న రిలీజైన అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోగా..ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన సన్నీ డియోల్ గదర్ 2 కూడా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది.

సన్నీ డియోల్, అమీషా పటేల్ జంటగా నటించిన ఈ సినిమాను తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కించారు. పాకిస్థాన్ ఆర్మీ దగ్గర చిక్కుకున్న కొడుకును తండ్రి ఎంతటి సాహసాలు చేసి తిరిగి దక్కించుకున్నాడో అనేది గదర్ 2 మూవీ నేపథ్యం. ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్ బాగా వర్కవుట్ అయినట్లు బాలీవుడ్ క్రిటిక్స్ పేర్కొంటున్నారు. రెండు దశాబ్దాల గ్యాప్ తర్వాత గదర్ సినిమాకు సీక్వెల్ గా గదర్ 2 రూపొందింది.