హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందిన సంచలన చిత్రం పుష్ప 2. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పుష్ప 2 రోజుకో రికార్డ్ చొప్పున క్రియేట్ చేసుకుంటూ దూసుకెళుతుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సరికొత్త రికార్డులు సెట్ చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు 1760 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డ్ ను క్రాస్ చేసే దిశగా దూసుకెళుతుంది. ఈ కలెక్షన్ 25 రోజుల్లోనే కలెక్ట్ చేయడం విశేషం.
ఈ బిగ్గెస్ట్ సక్సె్స్ పై బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తాజాగా స్పందించాడు. పుష్ప 2 భారీ విజయం సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సినిమా మున్ముందు మరింత విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అంటూ అమీర్ ఖాన్ తన నిర్మాణ సంస్థ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. దీనికి పుష్ప-2 టీమ్ ధన్యవాదాలు తెలిపింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియన్ సినీ చరిత్రలో అమీర్ ఖాన్ నటించిన దంగల్ మూవీ అత్యధిక వసూళ్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, బాహుబలి-2 టాప్ 2లో నిలిచింది. ఇప్పుడు పుష్ప-2 చిత్రం 3వ స్థానంలో ఉంది. బాహుబలి 2 రికార్డ్ ను క్రాస్ చేసి సెకండ్ ప్లేస్ లో నిలవడం ఖాయం.