పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్ భామ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఏడడుగులు వేసేందుకు రెడీ అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె వివాహం త్వరలో జరగనుంది. కొన్ని నెలల కిందట వీరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ఈ నెల 24న డేట్ ఫిక్స్ చేసినట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంటోంది. రాజస్థాన్ ఉదయ్ పూర్ నగరం పరిణీతి చోప్రా వివాహానికి వేదిక కానుంది.

ఈ నెల 24న పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహ వేడుకలు రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఫేమస్ లీలా ప్యాలెస్ లో జరగనుంది. ఇక్కడి తాజ్ లేక్ ప్యాలెస్ లో ఇందుకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలు జరుపుతారని తెలుస్తోంది.

ఈ నెల 30న ఛండీగడ్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు పరిణీతి బంధువులు చెబుతున్నారు. పరిణీతి, రాఘవ్ కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబ పెద్దల అనుమతితో వీరు పెళ్లికి సిద్ధమయ్యారు.