కిరణ్ అబ్బవరం హీరోగా “క” సినిమా సక్సెస్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు దర్శకద్వయం సుజిత్, సందీప్. వీళ్లిద్దరు ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్స్ గా మారారు. దీంతో పలు పెద్ద నిర్మాణ సంస్థలు సుజిత్, సందీప్ ను అప్రోచ్ అవుతున్నాయి. వీరి దర్శకత్వంలో కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కు ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయి.
ఒక సెక్షన్ ఆడియెన్స్ చూసే థ్రిల్లర్ జానర్ లో “క” సినిమా రూపొందించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించి తమ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు సుజిత్, సందీప్. సరికొత్త స్క్రీన్ ప్లే, మేకింగ్ తో తమ ఫ్యూచర్ మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ దర్శకద్వయం నుంచి ప్రేక్షకులు త్వరలోనే కొన్ని బిగ్ సర్ ప్రైజింగ్ మూవీస్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.