“డ్రింకర్ సాయి” సినిమాకు డైరెక్టర్ మారుతి ప్రశంసలు

“డ్రింకర్ సాయి” టైటిల్ చూసి పొరపడుతున్నారని, సినిమా మంచి కాన్సెప్ట్ తో దర్శకుడు కిరణ్ రూపొందించారని అన్నారు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి. తాజాగా ఆయన “డ్రింకర్ సాయి” సినిమా స్పెషల్ షోను చూశారు. ఆయనతో పాటు యువ దర్శకుడు అర్జున్ జంధ్యాల, నటుడు రంగస్థలం మహేశ్ ఈ మూవీ షో చూశారు. అనంతరం దర్శకుడు మారుతి “డ్రింకర్ సాయి” సినిమా టీమ్ ను అభినందించారు.

డైరెక్టర్ కిరణ్ గతంలో ఈరోజుల్లో సినిమాకు మారుతి దగ్గర అసోసియేట్ గా పనిచేశారు. ఆ స్నేహంతో “డ్రింకర్ సాయి” సినిమా షో చూసేందుకు వచ్చారు మారుతి. “డ్రింకర్ సాయి” సినిమాను కిరణ్ బాగా రూపొందించాడని, చివరి 20 నిమిషాలు హార్ట్ టచింగ్ గా ఉందని మారుతి అన్నారు. హీరో ధర్మ నటన ఆకట్టుకుందని మారుతి తెలిపారు. అతనికి మంచి ఫ్యూచర్ ఉందని, ఈ సినిమా మరింత పెద్ద విజయం సాధించాలని మారుతి కోరారు.

డైరెక్టర్ అర్జున్ జంధ్యాల, నటుడు రంగస్థలం మహేశ్ “డ్రింకర్ సాయి” సినిమా తమకు బాగా నచ్చిందంటూ మూవీ టీమ్ కు కంగ్రాట్స్ చెప్పారు. తమ సినిమా చూసి ప్రశంసించిన డైరెక్టర్ మారుతికి కృతజ్ఞతలు తెలిపారు “డ్రింకర్ సాయి” సినిమా టీమ్