వరదల ఎఫెక్ట్ – పవన్ సినిమాల అప్డేట్స్ వాయిదా

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు భారీ వర్షాలు(Heavy rains), వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాల అప్డేట్స్ అన్నీ వాయిదా వేశారు. ఈ రోజు పవన్ పుట్టినరోజు కావడంతో ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమాల నుంచి విశెస్ చెబుతూ పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పవన్ సినిమాల నుంచి కంటెంట్ రిలీజ్ చేయడం సరైనది కాదని మేకర్స్ భావించారు.

మరోవైపు పవన్ కల్యాణ్ కూడా తన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ కు ఎలాంటి సెలబ్రేషన్స్ చేయవద్దని సూచించారట. దీంతో ఓజీ(OG) సినిమా నుంచి రిలీజ్ చేయాల్సిన ఫస్ట్ సింగిల్, కొత్త పోస్టర్, అలాగే హరి హర వీరమల్లు(Hari Hara veeramallu), ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad bhagatsingh) సినిమాల నుంచి రిలీజ్ చేయాలనుకున్న బ్రాండ్ న్యూ పోస్టర్స్ రిలీజ్ ను వాయిదా వేశారు. మరో మంచి డేట్ చూసుకుని తమ సినిమాల నుంచి అప్డేట్ ఇస్తామని ఈ మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.