బిగ్ బాస్ 7 హోస్ట్ పై క్లారిటీ వచ్చేసిందిగా..

టెలివిజన్ చరిత్రలో సంచలనం బిగ్ బాస్. ఈ రియాల్టీ షో ఏ భాషలో సక్సెస్ కానంతగా తెలుగులో సక్సెస్ అయ్యింది. ఫస్ట్ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. అయితే.. ఫస్ట్ సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ అయితే.. సెకండ్ సీజన్ కు నాని హోస్ట్ గా చేశారు. ఇక మూడవ సీజన్ నుంచి ఆరవ సీజన్ వరకు టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. ఆరవ సీజన్ అనుకున్నంతగా సక్సెస్ కాలేదనే టాక్ వచ్చింది. కంటెస్టంట్లు కూడా చెప్పుకోదగ్గవాళ్లు రాకపోవడంతో జనాలు అంతగా ఆసక్తి చూపించలేదు.

అందుచేత బిగ్ బాస్ సీజన్ 7 అంతకు మించి అనేట్లు ప్లాన్ చేశారట. అయితే.. హోస్ట్ గా నాగార్జున కాకుండా వేరే స్టార్ ను పెట్టనున్నారని ప్రచారం జరిగింది. బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షోకు బాగా క్రేజ్ రావడంతో బాలయ్యను బిగ్ బాస్ 7 కు హోస్ట్ గా తీసుకోనున్నరానే వార్త ప్రచారంలోకి వచ్చింది. దీంతో బిగ్ బాస్ 7 హోస్ట్ ఎవరు..? బాలయ్యా..? నాగార్జునా..? అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల రానా పేరు గట్టిగా వినిపించింది. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మళ్లీ నాగార్జునే హోస్ట్ గా చేస్తున్నారు. దీనికి సంబంధించి రిలీజ్ చేసిన ప్రొమో ఆకట్టుకుంటుంది. మరి.. ఈసారి ఎంత వరకు మెప్పిస్తారో చూడాలి.