బిగ్ బాస్ సీజన్ 8 విజేత నిఖిల్

బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ విజేతగా నిలిచాడు. నిన్న రాత్రి ఘనంగా జరిగిన బిగ్ బాస్ ఫినాలేలో నిఖిల్ గెలుపొందారు. రన్నరప్ గా గౌతమ్ నిలిచారు. రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ఈ గ్రాండ్ ఫినాలే జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన గ్రాండ్ ఫినాలే వ్యూయర్స్ ను ఆకట్టుకుంది.

విన్నర్ నిఖిల్ కు రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా టైటిల్ అందించారు. అలాగే 55 లక్షల రూపాయల ప్రైజ్ మనీ నిఖిల్ కు అందించారు రామ్ చరణ్. గతంతో చూస్తే విజేతకు దక్కిన పెద్ద మొత్తం ఇదే అనుకోవచ్చు. గ్రాండ్ ఫినాలే ముగియడంతో బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.