బిగ్ బ్యానర్ లో విజయ్ దేవరకొండ మూవీ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరో బిగ్ బ్యానర్ లో మూవీ చేయబోతున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ లో ఆయన తన నెక్ట్ మూవీ చేస్తున్నారని టాలీవడ్ లో టాక్ వినిపిస్తోంది. విజయ్ కు ఫస్ట్ పేరు తీసుకొచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం ఈ బ్యానర్ లోనే చేశాడు. ఆ తర్వాత ఈ సంస్థ నిర్మించిన మహానటిలో కీ రోల్ చేసి పేరు తెచ్చుకున్నాడు విజయ్. మహానటిలో సమంతతో విజయ్ పెయిర్ ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యింది.

వైజయంతీ మూవీస్ ప్రొడ్యూసర్స్ తో విజయ్ దేవరకొండకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థలో తన కొత్త సినిమాకు విజయ్ అంగీకారం తెలిపినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం వైజయంతీ మూవీస్ ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడీ అనే సినిమాను నిర్మిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే సమ్మర్ లో రిలీజ్ కానుంది. కల్కి రిలీజ్ తర్వాత విజయ్, వైజయంతీ మూవీస్ సినిమాకు సన్నాహాలు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

రీసెంట్ గా ఖుషి సక్సెస్ తో ఉత్సాహంలో ఉన్న విజయ్..ప్రస్తుతం పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నెక్ట్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో ఓ మూవీ చేస్తున్నాడు.