భోళా… ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?

 

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా భోళా శంకర్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తాజాగా టాక్ వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 18న భోళా శంకర్ డిజిటల్ ప్రీమియర్ కానుందని తెలుస్తోంది. ఓటీటీ రిలీజ్ లోనేనా ఈ సినిమా ఏదైనా మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఫ్యాన్స్ వరకైతే ఓటీటీలోనూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని అనుకోవచ్చు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాను నిర్మించారు. తమిళ హిట్ మూవీ వేదాళం ఇన్సిపిరేషన్ తో భోళా శంకర్ చేసినట్లు దర్శకుడు మెహర్ చెప్పుకున్నాడు. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేష్, జోడీగా తమన్నా నటించారు. ఈ నెల 11న థియేటర్స్ లోకి వచ్చిన భోళా శంకర్…వారం రోజులకే ఫుల్ రన్ కంప్లీట్ చేసుకుంది. ఫుల్ రన్ లో కేవలం 30 కోట్ల రూపాయలు వసూళు చేసి బయ్యర్లకు తీవ్ర నష్టాలు తీసుకొచ్చింది.