నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న “భజే వాయు వేగం”

కొత్త సినిమాల రాకతో ఓటీటీ (OTTs)లు కళకళలాడుతున్నాయి. ఈవారం ఓటీటీ లవర్స్ కు కావాల్సినన్ని ఆప్షన్స్ ప్రైమ్ వీడియో (Prime video), నెట్ ఫ్లిక్స్ (Netflix) , ఆహాలోకి దొరుకుతున్నాయి. ఈ సందడి పెంచుతూ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది “భజే వాయు వేగం” (Bhaje vayu vegam) సినిమా. బెదురులంక సినిమా సక్సెస్ తర్వాత హీరో కార్తికేయకు (karthikeya gummakonda) మరో విజయాన్ని అందించిన ఈ మూవీ..ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సినిమా అతి తక్కువ టైమ్ లో నెట్ ఫ్లిక్స్ లో ట్రెండింగ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

“భజే వాయు వేగం” సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ (UV concepts) నిర్మించింది. ఈ సినిమా గత నెల 31న థియేటర్స్ లో రిలీజైంది. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి చంద్రపు (Prashant reddy chandrapu) తన తొలి సినిమాతోనే టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. సక్సెస్ ఫుల్ సినిమాతో లాంఛ్ అయ్యాడు. యూవీ సంస్థ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్రను పోషించారు.