అదరగొట్టిన భగవంత్ కేసరి

నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ భగవంత్ కేసరి. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తుంటే.. కూతురుగా శ్రీలీల నటిస్తుంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ప్రొమో రిలీజ్ చేశారు. గణేష్ ఆంధమ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రొమోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గణేష్ గొప్పతనాన్ని తెలియచేస్తున్న ఫస్ట్ సింగిల్ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.

ఈ సాంగ్ లో బాలయ్య, శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టేసారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను కరీముల్లా, మనీషా పాండ్రంకి ఆలపించారు. లిరికల్ వీడియోలో నందమూరి బాలకృష్ణ ఎనర్జీ అద్భుతంగా ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటకు థమన్ అద్భుతమైన బీట్స్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ భగవంత్ కేసరి అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించిన బాలయ్య భగవంత్ కేసరి చిత్రంతో హ్యాట్రిక్ సాధిస్తాడేమో చూడాలి.