బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతున్నట్లు సమాచారం. ఈ సినిమా దసరా రేసు నుంచి తప్పుకుందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. కాజల్ అగర్వాల్, శ్రీలీల లేడీ లీడ్స్ చేస్తున్నారు.
టీడీపీ లీడర్ చంద్రబాబు అరెస్టయినప్పటి నుంచి బాలకృష్ణ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు. ఆయన ఏపీలో పరామర్శలు చేస్తున్నారు. దీంతో ఇక్కడ భగవంత్ కేసరి సినిమాకు వేసుకున్న షెడ్యూల్స్ మారిపోయాయి. బాలకృష్ణ ఇంకొన్ని రోజులు ఏపీలోనే పొలిటికల్ వ్యవహారాల్లో ఉండిపోయే అవకాశాలున్నాయి. దాంతో భగవంత్ కేసరిని దసరాకు రెడీ చేయలేరని టాక్ వినిపిస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణ లేని సీన్స్ చిత్రీకరిస్తున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. అక్టోబర్ 19న భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న రిలీజ్ కావాల్సి ఉండగా..ఇప్పుడు దసరా రేసు నుంచి భగవంత్ కేసరి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.