“భగవంత్ కేసరి” తమిళ రీమేక్ కన్ఫర్మ్

కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి సినిమా విషయంలో విజయ్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇది విజయ్ 69వ చిత్రం. ఈ చిత్రాన్ని కోలీవుడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ తెరకెక్కించనున్నారు. అయితే.. ఈ సినిమా గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అది ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రాన్నే తమిళ్ లో రీమేక్ చేయాలి అనుకుంటున్నారట. ఈ సినిమా కథ విజయ్ కు నచ్చడంతో లాస్ట్ మూవీగా దీనినే రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇది నిజమా.? కాదా..? అనేది సస్పెన్స్ గా ఉండేది.

ఇప్పుడు ఈ సస్పెన్స్ కు తెర దించేసారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో మీరు డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి చిత్రాన్ని విజయ్ రీమేక్ చేస్తున్నారని తెలిసింది నిజమేనా అని అడిగితే.. ఈ విషయాన్ని వాళ్లే అనౌన్స్ చేయాలి. నేను చెప్పకూడదు అంటూనే.. రీమేక్ విషయమై చర్చలు జరిగాయని.. నన్నే డైరెక్ట్ చేయమన్నారని కూడా చెప్పాడు అనిల్ రావిపూడి. కానీ.. ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడకూడదన్నాడు. మొత్తానికి చెప్పకూడదు అంటూనే విజయ్ లాస్ట్ మూవీ వెనకున్న అసలు సీక్రెట్ బయటపెట్టేశాడు అనిల్.